Desiplaza TV Live
Community Info/ Updates

GOPIO-CT Honors Six Indian American Achievers At Its 12th Annual Awards Banquet In Stamford

“The evening is a celebration – a celebration not just of the accomplishments of our…

Shanti Bhavan Celebrates its 9th Graduating Class

This June, Shanti Bhavan celebrated its ninth graduating class. The class of 2018 is now…

NJBIZ Honors 2018 New Jersey’s Healthcare Heroes; Indian Health Camp of New Jersey won Education Hero Award

Indian Health Camp of New Jersey – IHCNJ received 2018 NJ BIZ Healthcare Heroes Award for…
Mastitime Radio

webapp masti1

“అక్షయంగా వెలుగొందిన యక్షగానం” వీనుల విందు చేసిన టాంటెక్స్ 102వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు

“అక్షయంగా వెలుగొందిన యక్షగానం” వీనుల విందు చేసిన టాంటెక్స్ 102వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు

 
0.0
 
0.0 (0)
4   0   0   0
Write Review
“అక్షయంగా వెలుగొందిన యక్షగానం”   వీనుల విందు చేసిన టాంటెక్స్ 102వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు

             కార్యక్రమం ప్రారంభంలో ఘంటసాల లలిత గీతాలను వీనుల విందుగా ఆలపించివడ్లమన్నాటి నాగేష్ మరియు కుందేటి చక్రపాణి అలనాటి మధుర గాయకుడిని మరోసారి గుర్తు చేశారు. పోతన భాగవతం నుండి పద్యాలను కుమారి  దొడ్ల నిర్జరదొడ్ల రమణ కమ్మగా పాడి వినిపించారు. బసాబత్తిన శ్రీనివాసులు వేలుపిళ్ళై కథలను సభకు పరిచయం చేస్తూకథా రచయిత  సి. రామచంద్రరావు 9 కథలు వ్రాసారనివేటికవే సాటి అని చక్కగా వివరించారు. తదుపరి జలసూత్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ సంక్రాంతి లేదా సంక్రమణం అంటే "చేరడం" అని, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది, ఇది ఎంతో పవిత్రమైన కాలం, దీనినే మకర సంక్రాంతి అంటారు అని ఇలా సంక్రాంతికి సంబంధించి ఎన్నో విషయాలను ఆద్యంతం ఆసక్తిగా వివరించారుమాడ దయాకర్ మాట్లాడుతూ మన తెలుగు కవులు పేరడీలలో ఎంతో ప్రసిద్ధులు అని, శ్రీ శ్రీ కవిత్వాన్ని పేరడీ చెయ్యనివాడు పేరడీ కవే కాడు అని ఎంతో హాస్య భరితంగా పేరడీ పరేడ్ నిర్వహించారు. ప్రముఖ రచయిత శ్రీ రమణ గారు, శ్రీ  విశ్వనాథ సత్యనారాయణ గారికి "పిచ్చి ప్రేమ" అనే సినిమా పై సమీక్ష రాయమంటే  విశ్వనాథ సత్యనారాయణ గారు హాస్య భరితంగా ఎలా రాస్తారో అనే ఊహాత్మక రచన చేశారు, దానిని మాడ దయాకర్ గారు చదివి నవ్వుల పువ్వులు పూయించారు.  వేముల లెనిన్ తన కమ్మని గాత్రం తో అసాధారణ జ్ఞాపక శక్తితో "తల్లీ నిను దలంచి" అంటూ మాడుగుల నాగ ఫణి శర్మ గారు రచించిన గీతాన్ని వీనుల విందుగా పాడి వినిపించారుడా. జువ్వాడి రమణ తెలుగు పద్యాలు చక్కగా పాడి వినిపించారు. డా. పుదూర్  జగదీశ్వరన్ ఇటీవల హ్యూస్టన్ నగరంలో ఆవిష్కరించిన తెలుగు అంతర్జాల పత్రిక "మధురవాణి" ని www.madhuravani.com ద్వారా చదువుకోవచ్చు అని తెలియచేశారు

 

 

ఈ నాటి ముఖ్య అతిధిని కార్యక్రమ సమన్వయకర్త పరిచయం చేస్తూ వేదిక మీదకు ఆహ్వానించగా,  రాణి భట్రాజు గారు డా.సుధ గారికి పుష్పగుచ్చం అందచేసారు.  తెలుగులో రెండు డాక్టరేట్ పట్టాలు సాధించి, చిన్న తనం నుండి నాట్యం పై మక్కువ పెంచుకొని జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకొన్న తెలుగు మహిళ డా. కలవగుంట సుధ గారు "అక్షయంగా వెలుగొందిన యక్షగానం" అనే అంశం మీద మాట్లాడుతూ, బ్రహ్మాండ పురాణంలో  దేవతలు, గంధర్వులు, గుహ్వకులు, రాక్షసులు, సిద్ధులు, యక్షులు అనే వర్గాలు ఉన్నాయి, యక్షులలో ఇంకా రాక్షసులు, భూతాలు అనే ఉప వర్గాలు  కూడా ఉన్నాయి, వాల్మీకి రామాయణం లో యక్షత్వం అంటే అమరత్వం, అదొక దివ్య ప్రసాదం అని తెలిపారు. వేదమంత్రాలలో యక్ష శబ్ధం పరమాత్మ వాచకం గా ప్రయోగింపబడింది, తెలుగు సాహిత్యంలో యక్ష శబ్దాన్ని చాలా రకాలుగా మన పూర్వులు ఉపయోగించారు, యక్ష జాతి, యక్ష రాత్రి, యక్ష ప్రశ్నలు, యక్షరాజు, యక్షిణి, యక్ష గ్రహం, ఇలా ఎన్నో విధాలుగా యక్ష శబ్దం ప్రయోగింపబడింది అని తెలిపారుమొట్ట మొదటి యక్ష గ్రంధం ప్రోలుగంటి చెన్నశౌరి రచించిన "సౌభరి చరితం", ఇది ప్రస్తుతానికి అలభ్యం, కవి కాలాదులు తెలిసినంతవరకు కందుకూరి రుద్రకవి వ్రాసిన "సుగ్రీవ విజయం" మొట్టమొదటిది అని తెలిపారు. 12 వ శతాబ్దంలో పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరితము లో శ్రీశైలం - శివరాత్రి - జాగరణ గురించి యక్ష గానాల గురించి ప్రస్తావించారు, 14 వ శతాబ్దంలో మహాకవి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో యక్షగాన సమస్త పదాన్ని, ద్రాక్షారామ ప్రశంస సందర్భంలో ప్రస్తుతించారు అని తెలిపారు. 16 వ శతాబ్దంలో అల్లసాని పెద్దన మనుచరిత్రలో ప్రవరాక్షుడు హిమవత పర్వత ప్రాంతంలో "గంధర్వ యక్ష ఘార్ణితమగు ... " అనే పద్యంలో యక్షుల గురించి ప్రస్తావించారుఆధునిక యుగంలో యక్షగానానికి పుట్టినిల్లు తెలుగు గడ్డ అని, క్రమేపీ తెలుగులో ఆదరణ తగ్గిపోవడం వలన పక్క రాష్ట్రం అయిన కర్ణాటక కు వలస పోయింది అని, తెలుగు యక్ష గాయకులు, సొంత గాత్రంతో కార్యక్రమాలు చేస్తే, కర్ణాటక వారికి రంగస్థలం బయట నుండి గాత్ర సాయం అందుతుంది అని తెలిపారు. డా . సుధ గారు , తమ పరిశోధనల నిమిత్తం తెలుగు రాష్టాలలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి లెక్కలేనన్ని గ్రామాలు తిరిగి, యక్ష గానాన్ని వృత్తిగా చేసుకొన్న కుటుంబాలను కలిసి, వారి అనుభవాలు గ్రంథస్తం చేసి,  ఛాయా చిత్రాలు, దృశ్యమాలికలు తీసి వాటిని పదిలపరిచారు. వాటినన్నిటిని ఈ సభలో ప్రదర్శించి వివిధ యక్ష గాన ప్రక్రియలను స్వయంగా చూసే అవకాశం కల్పించారు. ఆ దృశ్యాలు అపురూపమైనవి, అజరామరమైనవి, వాటిని చూసిన ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవు. డా సుధ గారు తెలుగు నేలకు గర్వకారణం అయిన కూచిపూడి గ్రామాన్ని సందర్శించి కూచిపూడి నాట్య పండితులను కలిసి వారి అనుభవాలు సేకరించి పదిలపరిచారు. సుధ గారు స్వయంగా గొప్ప కూచిపూడి కళాకారిణి కావడంతో వారికి తన పుట్టిల్లుకు వెళ్ళిన అనుభవం కలిగిందని చెప్పారు. ఆ అనుభవాలను సభలో పంచుకొని అందరి మనసులో యక్షగాన కళల పట్ల మరింత ఆసక్తి కలుగచేసారు ఇలా మరుగున పడిపోతున్న కళలను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఒక గృహిణి, మాతృమూర్తి, అమెరికా లో స్థిరపడినా తెలుగు భాష, కళలపై ఎంతో మక్కువతో, తన  చిన్న పిల్లలను ఇద్దరిని తన వెంట తీసుకొని, కాలినడకన  ఎన్నో తెలుగు పల్లెలలో పర్యటించి, అలుపెరుగని బాటసారిలా, తెలుగు కళలను పరిరక్షించే సరస్వతి పుత్రికగా ఆవిడ చేసిన సేవలకు రాష్ట్రపతిచే  పురస్కారం, లెక్కలేనన్ని అవార్డులు ఎన్నో తనను వరించినా, వీటన్నిటి కన్నా తెలుగు నేల మీద తొలి అడుగులు వేసిన యక్ష గానం ఇంకా విస్తరించేలా చేయడంలోనే నిజమైన ఆనందం అనే డా. సుధ గారిని ఆహూతులు అభినందించారు.

 

డాకలవగుంట సుధ గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు పాలక మండలి అధిపతి గుర్రం శ్రీనివాస్ రెడ్డి శాలువతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు  జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారుసంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్త జసదస్సు జరుపుకోవడం మహదానందంగా ఉంది అన్నారుసమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ మాట్లాడుతూ టాంటెక్స్ కళలకు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంది, మన స్థానిక కళాకారులను ఈ విధంగా సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికితెలుగు భాషాభిమానులకుసాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారుప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా,       రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ5, టీవీ9, సీవిఆర్ న్యూస్, 6టీవీ, ఐనా టీవి, హంఔరా  లకు కృతఙ్ఞతాభినందనలు తెలియజేసారు.

 

ఈ కార్యక్రమంలో టాంటెక్స్ తక్షణ  పూర్వాధ్యక్షులు డాఊరిమిండి నరసింహారెడ్డి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, సంయుక్త కోశాధికారి సింగిరెడ్డి శారద మరియు కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, మండిగ శ్రీ లక్ష్మిగోవాడ అజయ్, తోట పద్మశ్రీ  ,కొణిదల లోకేష్ నాయుడు మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు అట్లూరి స్వర్ణ, మర్తినేని మమత, దిండుకుర్తి నగేష్ పాల్గొన్నారు

 

 

కార్యక్రమ విశేషాలను చిత్రాల ద్వారా, ఈ క్రింద పొందు పరచిన లంకెలో చూడవచ్చును.

User reviews

There are no user reviews for this listing.
Already have an account? or Create an account
Movie Reviews

Tik Tik Tik (2018) Movie Review, Rating -2/5

Jun 22, 2018 14
Bottom Line: Logical loopholes and unimpressive CG impact this space travel.

Jamba Lakidi Pamba (2018) Telugu Movie Review, Rating -1.5/5

Jun 22, 2018 16
Bottom Line: A boring flick laced with poor jokes.

Incredibles 2 Movie Review, Rating -3.5/5

Jun 22, 2018 15
Bottom Line: Brad Bird and team Incredibles deliver a strong winner even after 14 years!
Upcoming Events
15 Jun 2018
10:30AM - 12:00AM
Sri Mahalakshmi Prana Pratishta
22 Jun 2018
07:30PM - 12:00PM
Carnatic Music Lessons
23 Jun 2018
11:00AM - 07:00PM
Joramal Jaggomal Jewellers
23 Jun 2018
11:00AM - 07:00PM
Joramal Jaggomal Jewellers
23 Jun 2018
02:30PM - 04:30PM
Temple Fundraising Concert
Restaurant Reviews

Essay Crafting Allow Evaluations & Guideline

Jun 07, 2018 65
Default Image
So, ostensibly if you are trying to find the optimal/optimally essay writing assistance…

Die Dies Tun, Zu Bekommen, Anleitung, Ghostwriter Masterarbeit

Jun 12, 2018 55
Default Image
Die Dies Tun, Zu Bekommen, Anleitung, Ghostwriter MasterarbeitDer 30-Sekunden-Trick f

Amaravati Restaurant

Oct 27, 2016 1452
Amaravati Restaurant is an Indian Cuisine, perfect and pleasant place for Delicious and…
Latest Yellow Pages
Mar 06, 2018

Andhramess Allen

Andhra Mess– Is the most popular South Indian Restaurant situated in Allen, US. We have…
Dec 04, 2017

Best deals on International flights

IndianEagle.com is an innovative online travel company that enables its customers to book…
Sep 05, 2017

Roy Photography

Experienced in Indian and South-Asian Weddings and event photo and video services. Speaks…
Aug 02, 2017

Pista House

Pista House is known for meeting the diverse needs of customers thanks to its use of best…
Latest Classifieds
Jun 19, 2018

Enjoy a Healthier Life with our Organic & Natural Food Range

MyHomeGrocers is leading online store that offers 100% natural & organic products at best…
Jun 15, 2018

Say No To Heavy Shopping Bags Shop all Your Grocery Needs Online

Say No To Heavy Shopping Bags Shop All Your Grocery Needs Online
Jun 12, 2018

Ramadan Special OUR GRAND SALE FOR VEGGIES AND FRUITS THIS WEEK

Ramadan Special OUR GRAND SALE FOR VEGGIES AND FRUITS THIS WEEK!BEAT THE SUMMER WITH…
Jun 04, 2018

DEVOPS Training Schedule (Weekend Batch).

DEVOPS Training Schedule (Weekend Batch). Training Type: Online Live Interactive Training…
Training
Default Image
Feb 03, 2018

DevOps Online Training Live Demo Feb 05, 2018(Monday) @7.00am IST

DevOps Online Training Live Demo Feb 05, 2018(Monday) @7.00am IST For USA Students Feb…
Default Image
Jan 31, 2018

selenium Training - learntek

Learntek: Selenium Training Schedule. Course Title: Selenium Training. Training Type:…
Jan 25, 2018

SAP Simple Finance Training by SAP Certified Industry Experts

We provide services throughout USA, UK, Australia,UAE, Canada, Saudi Arabia, New Zealand,…
Jan 04, 2018

Tableau Training Institute in Noida

Tableau computing device is a business intelligence andinformation visualization tool…