Speech Contest
Speech Contest
Express Family Clinic
Express Family Clinic
Venetian Theater
Venetian Theater
24by7Courier
24by7Courier
Yarlagadda
Yarlagadda
Fitbase
Fitbase
Commercial Real Estate
Commercial Real Estate
Dammanna Law
Dammanna Law
Amaravati Restaurant
Amaravati Restaurant
Astrologer Pandith Ram Tulasi
Astrologer Pandith Ram Tulasi
దాశరథి కవితా వైభవంలో ఓలలాడిన 112 వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

దాశరథి కవితా వైభవంలో ఓలలాడిన 112 వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

 
0.0
 
0.0 (0)
7   0   0   0
Write Review
దాశరథి కవితా వైభవంలో ఓలలాడిన 112 వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల"  సాహిత్య సదస్సు ఆదివారం నవంబర్ 20వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన ఘనంగానిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 112 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు. 

బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 112వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముందుగా స్వాతిగారు చక్కగా అన్నమయ్య కీర్తన గానం చేసారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన శ్రీ కుల్దీప్ సింగ్ తనకు తెలుగు బాష పరిచయం ఎలా కలిగిందో వివరించారు. తల్లిదండ్రులు పిల్లలతో తప్పనిసరిగా తమ మాతృభాషలో సంభాషించాలని సభికులని కోరారు. డాలస్ కి చెందిన శ్రీ కాజా సురేష్ గారు శ్రీకాళహస్తీశ్వర మహత్యం రచించిన దూర్జటి మహాకవి గారి పద్యాలను కొన్ని చదివి వినిపించారు.శ్రీ పిస్కా సత్యనారాయణ గారు గతంలో నెలనెలా తెలుగువెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో మహాకవి శ్రీనాధుని శ్లేష చమత్కారం గురించి మాట్లాడారు. తెలుగు భాషలోని శ్లేష గురించి విశ్లేషించారు.


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి గారు "మన తెలుగు సిరి సంపద"  శీర్షికన తెలుగు భాషలోని జాతీయాలు, సామెతలను సభికులకు గుర్తు చేసారు. ప్రతి నెలా ఈ శీర్షికపై తెలుగు భాషలోని సిరిసంపదల గురించి మాట్లాడుకుందామన్నారు.


ప్రతి నెలా జరిగే నెలనెలా తెలుగు వెన్నెలలో అట్లూరి స్వర్ణగారు నిర్వహించే ప్రశ్నావళి కార్యక్రమం బాగా సందడిగా జరుగుతుంది. ఈసారికూడా స్వర్ణ గారు అడిగిన ప్రశ్నలకు సభికులు తికమక పడ్డారు. చివరకు రెండు జట్టులకి ఒకే మార్కులు వచ్చి ఆట సరదాగా ముగిసింది. ప్రతి ఆదివారం సాయంత్రం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 4 గంటల నుండి 6 గంటల వరకు సాగుతుంది. ఈ కార్యక్రమానికి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ 112వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి టాంటెక్స్ తరంగిణిలో తెలుగు వన్ రేడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు.


112వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వేముల లెనిన్ బాబు గారిని పరిచయం చేస్తూ మద్దుకూరి చంద్రహాస్ వేదిక మీదకు ఆహ్వానించగా, ప్రొఫెసర్ దంతు రాం ముఖ్య అతిథికి పుష్పగుచ్చం అందచేసారు.


శ్రీ వేముల లెనిన్ బాబు గారు దాశరథి కవితా వైభవంపై ప్రసంగించారు. తొంభై నిముషాల పాటూ అనర్గళంగా లెనిన్ గారు దాశరధిగారి పాటలనే కాకుండా మహాకవి శ్రీశ్రీ పద్యాలని కూడా ఆలపించారు. లెనిన్ గారి ఇద్దరమ్మాయిలు కూడా కొన్ని పాటలని ఆలపించారు. లెనిన్ గారి శ్రీమతి కూడా ఒక పాట పాడడం ఒక విశేషం. మొదటిసారిగా నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో ముఖ్య అతిథి మాత్రమే కాకుండా అతని కుటుంబం మొత్తం పాలు పంచుకోవడం ఇదే ప్రధమం.


ముఖ్య అతిథిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్)  అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మరియు ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి శాలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపిక తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్), పూర్వాధ్యక్షులు డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, కార్యవర్గ సభ్యులు పావులూరి వేణు, తోట పద్మశ్రీ , పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

User reviews

There are no user reviews for this listing.
Already have an account? or Create an account
24by7Courier
24by7Courier
Yarlagadda
Yarlagadda
Amaravati Restaurant
Amaravati Restaurant
Express Family Clinic
Express Family Clinic
Venetian Theater
Venetian Theater
Dammanna Law
Dammanna Law
Fitbase
Fitbase
Astrologer Pandith Ram Tulasi
Astrologer Pandith Ram Tulasi
Speech Contest
Speech Contest
Commercial Real Estate
Commercial Real Estate